ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావు

by Indraja |
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావు
X

దిశ వెబ్ డెస్క్: నేడు పల్లా శ్రీనివాసరావు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. అలానే పార్టీని, ప్రభుత్వాన్ని, నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని పల్లా శ్రీనివాసరావు గారు ప్రకటించారు.‌

తెలుగుదేశం పార్టీకి బలం, బలగమైన కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తనకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించినందుకు నారా చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story