- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మరోసారి హాట్‌టాపిక్‌గా లగడపాటి.. ఆయన కోసం ప్రచారం చేస్తానని ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం రాజమండ్రిలో పర్యటించారు. ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్‌లతో వరుస భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. తాను రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ఉండవల్లికి మద్దతిచ్చి తీరుతా అని స్పష్టం చేశారు.
ఆయన ఎదురుగా ఎవరు పోటీ చేసినా ఉండవల్లికి మద్దతుగా ప్రచారం చేస్తా అని చెప్పారు. కాగా, రాష్ట్ర విభజన తర్వాత లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో మళ్లీ పోటీచేస్తారని ప్రచారం జరిగినా ఆయన మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. నాలుగైదు నెలల క్రితం లగడపాటి మళ్లీ పోటీచేస్తారని చర్చ జరిగింది. ఆయన మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.