- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మా నాన్న రాజీనామాతో నాకు సంబంధం లేదు.. ఎంపీ అర్వింద్
దిశ, వెబ్ డెస్క్: సీనియర్ రాజకీయ నాయకుడు డీఎస్ రాజీనామా వ్యవహారం ఆయన కొడుకులు సంజయ్, అర్వింద్ మధ్య చిచ్చు పెట్టింది. తన తమ్ముడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఒత్తిడి వల్లే తమ తండ్రి డీఎస్ కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లు డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్ ఆరోపించారు. అర్వింద్ దిగజారి వ్యవహరిస్తున్నారంటూ సంజయ్ ఫైర్ అయ్యారు. కాగా సోదరుడు సంజయ్ చేసిన ఆరోపణలపై ఎంపీ అర్వింద్ స్పందించారు. తమ తండ్రి డీఎస్ రాజీనామాతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై తన సోదరుడు సంజయ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
తన తండ్రిని బీజేపీలో చేర్పించడంలేదన్న ఆయన.. చివరి వరకు డీఎస్ కాంగ్రెస్ వాదేనంటూ స్పష్టం చేశారు. కాగా ఆదివారం డీఎస్ తన పెద్ద కుమారుడు సంజయ్ తో కలిసి టీకాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అయితే అనూహ్యంగా 24 గంటలు కూడా గడవక ముందే కాంగ్రెస్ కు డీఎస్ రాజీనామా చేస్తున్నట్లు ఆయన భార్య విజయలక్ష్మి తెలిపారు. డీఎస్ కు ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నారన్న ఆమె.. డీఎస్ ను ఒప్పించడానికి కాంగ్రెస్ నేతలెవరూ తమ ఇంటికి రావొద్దంటూ కోరారు.