ప్రజలు డిగ్రీ చూసి ప్రధాని మోడీకి ఓట్లు వేశారా?:

by GSrikanth |
ప్రజలు డిగ్రీ చూసి ప్రధాని మోడీకి ఓట్లు వేశారా?:
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ సర్టిఫికెట్ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు మోడీ డిగ్రీ పట్టా ఆధారంగా ఓట్లు వేశారా అని ప్రశ్నించారు. మంత్రుల పట్టాలపై ప్రశ్నించడం సరికాదని ఒక నాయకుడు తమ హయాంలో ఏం సాధించారనే దానిపై ప్రజలు దృష్టి సారించాలన్నారు. తాజాగా జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ మోడీ తొమ్మిదేళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పుడు అతని డిగ్రీ గురించి అడగడం సరైంది కాదు.

విద్యార్హత పత్రాలపై కాకుండా దేశంలోని ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలపై మోడీని ప్రశ్నించాలి అంతే కానీ డిగ్రీ సర్టిఫికెట్ ముఖ్యం కాదన్నారు. 2014లో ప్రధాని మోడీకి డిగ్రీ పట్టాను చూసి ప్రజలు ఓట్లు వేయలేదని అతడి చరిష్మా గెలుపు దోహదపడిందని అన్నారు. కాగా తమ ప్రధాని ఎంత వరకు చదువుకున్నారో తెలుసుకునే హక్కు దేశానికి లేదా అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మోడీపై విమర్శలు గుప్పిస్తున్న వేళ అనూహ్యంగా అజిత్ పవార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

Advertisement

Next Story

Most Viewed