Nara Lokesh: ప్రజాదర్బార్‌కు వెల్లువెత్తుతున్న వినతులు.. నారా లోకేష్

by Indraja |   ( Updated:2024-06-28 10:25:11.0  )
Nara Lokesh: ప్రజాదర్బార్‌కు వెల్లువెత్తుతున్న వినతులు.. నారా లోకేష్
X

దిశ వెబ్ డెస్క్: టీడీపీ అధినేత తనయుడు నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి “ప్రజాదర్బార్’’ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రజలను కలిసి వాళ్ల సమస్యలను తానే స్వయంగా తెలుసుకుని, వీలైనంత త్వరగా ఆ సమస్యల పరిష్కారానికి యత్నిస్తున్నారు. కాగా తాను చేసట్టిన ప్రజాదర్బార్‌పై నారా లోకేష్ ట్వట్టర్ వేదికగా స్పంధించారు. ‘కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచేందుకు నేను చేపట్టిన “ప్రజాదర్బార్”కు వినతులు వెల్లువెత్తుతున్నాయి.

తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని మా నివాసానికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను విన్నాను. ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చాను. సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశా’ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story