- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
New Parliament building inauguration :పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చడంపై ఒవైసీ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: నూతన పార్లమెంట్ భవనం శవపేటిక ఆకారంలో ఉందని ఆర్జేడీ చేసిన ట్వీట్‌పై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీకి ఓ స్టాండ్ అంటూ ఏమీ లేదని ధ్వజమెత్తారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ఆర్జేడీ శవపేటిక అని ఎందుకు పిలుస్తోందని నిలదీశారు. ఆ పార్టీ ఇంకేమైనా మాట్లాడి ఉండవచ్చు. కానీ కొత్త భవనం విషయంలో ఈ కోణం తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. పాత పార్లమెంట్ భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ నుంచి క్లియరెన్స్ లేదని గుర్తు చేశారు.
అయితే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కాకుండా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కాగా, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని అధికార విభజనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని స్పీకర్ చేత కాకుండా ప్రధాని ప్రారంభించడం సరికాదని ఆరోపిస్తూ ఎంఐఎం పార్టీ నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉంది.
Read More: శవపేటికలా పార్లమెంట్ అంటూ ట్వీట్.. ఆర్జీడీపై బీజేపీ ఆగ్రహం