- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana లో ముదురుతున్న మోడీ ఫోటో వార్!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఫోటో ఫైట్ పీక్స్‌కు చేరుకుంది. రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రులు రేషన్ షాప్‌లు, కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ఈ అంశంలో నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించగా నేడు మరో కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే టీఆర్ఎస్ సర్కార్‌ను నిలదీశారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన మహేంద్రనాథ్ పాండే ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణలో జారీ చేస్తున్న కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై నరేంద్ర మోడీ ఫోటో ముద్రించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అన్ని రాష్ట్రాల్లో ప్రధాని ఫోటోను వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై ముద్రిస్తున్నప్పుడు తెలంగాణలో ముద్రించేందుకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ సెంటర్‌లో బ్యానర్ ఉందని అందులో సీఎం కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఫోటోలు ఉన్నాయి కానీ, ప్రధాని ఫోటో లేకపోవడాన్ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ కేవలం బీజేపీకే ప్రధాని కాదని దేశానికి ప్రధాని అని అలాంటి వ్యక్తి ఫోటో ముద్రించడంలో తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలో సీఎం కేసీఆర్ ఫోటోలు పెట్టాలన్న హరీశ్ రావు వ్యాఖ్యలపై మహేంద్రనాథ్ పాండే స్పందించారు. కేసీఆర్ పగటి కలలు మానుకోవాలని సూచించారు.
హరీశ్ రావుకు నిర్మలా సీతారామన్ కౌంటర్:
తన వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో రైతులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో పర్యటిస్తున్న ఆమె శనివారం గాంధారిలో తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం భూ నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. మానేరు, మల్లన్న సాగర్, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, సీతారామ ప్రాజెక్టు, కిష్టన్నపల్లి, శివన్న గూడెం, నక్కల గండి భూ నిర్వాసితులకు ఇవాళ్టికి కూడా పూర్తిస్థాయి పరిహారం ఇవ్వలేదని అన్నారు. తెలంగాణలోని 91 శాతం రైతాంగం అప్పుల పాలయ్యారని అన్నారు. ఈ లెక్కలు తాను చెబుతున్నవి కాదని ఎన్ఆర్సీబీ గణాంకాలు చెబుతున్నాయని అన్నారు. 2017 నుంచి 2019 వరకు 2,237 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.
రైతుల కోసం కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని తెలంగాణకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 2014 నుంచి ఇప్పటి వరకు రూ. 7,658 కోట్లు ఇచ్చామన్నారు. కృషి వికాస్ యోజన కింద రూ. 8,590 కోట్లు, ఎన్ ఎఫ్ ఎన్ ఎస్ స్కీమ్ కింద రూ. 51 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. తెలంగాణలో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రూ. 17 వేల కోట్ల రుణమాఫి చేస్తానని టీఆర్ఎస్ పార్టీ చెప్పింది కానీ, అమలు చేయలేక పోయిందని విమర్శించారు. వంద మంది రైతుల్లో ఐదు మందికే రుణమాఫీ జరిగిందని ఇది తాను చెప్పింది కాదని ఎస్బీఐ చెప్పిన లెక్క అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
కేసీఆర్ వల్లనే రైతుల ఆత్మహత్యలు.. 17 వేల కోట్ల రుణమాఫీ ఏమైంది: కేంద్ర మంత్రి