- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనసేన పార్టీ ఎందుకో పవన్‌కే తెలీదు.. మంత్రి అంబటి రాంబాబు
దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరోసారి టార్గెట్ చేస్తూ ఏకధాటిగా విమర్శల దాడి చేశారు. అసలు జనసేన పార్టీ ఎందుకు పెట్టారో పవన్ కల్యాణ్‌కే తెలియదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు జనసేన పార్టీని పెట్టావా? లేక వైఎస్ జగన్‌ను ఓడించేందుకు పార్టీ పెట్టావా? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పల్నాడు జిల్లా మాచర్లలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల పందేల పోటీలను ప్రారంభించే కార్యక్రమంలో అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. జనసేన పార్టీ వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పుకొచ్చారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకిగానీ టీడీపీకి గానీ ఒంటరిగా పోటీ చేసే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ‘మీ కోసం నేను మంచి చేశాను, నేను చేసిన మంచి మీకు నచ్చితే నన్ను మళ్లీ గెలిపించి ఆశీర్వదించండి’ అని ధైర్యంగా ప్రజలను అడగగలిగిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎ్స జగన్ మాత్రమేనని కొనియాడారు. చంద్రబాబు పాలనలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం తలపెట్టారో చెప్పాలని ఛాలెంజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు చంద్రబాబు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారని..ఎవరు ఎంతమందితో కలిసి వచ్చినా, ఎన్ని కుయుక్తులు పన్నినా వైసీపీ గెలుపును అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.
Also Read..