- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కవితకో న్యాయం నాకో న్యాయమా?.. ఇందిరా శోభన్

దిశ, డైనమిక్ బ్యూరో: కవిత విషయంలో ట్రోల్ చేస్తే చర్యలు తీసుకున్న పోలీసులు తాను అనని మాటలను అన్నట్లుగా ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీనియర్ పొలిటీషియన్ ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు. తాను చేయని వ్యాఖ్యలు చేసినట్లుగా నా ఫోటో పెట్టి ట్రోల్ చేస్తున్నారని దీని వెనుక బీఆర్ఎస్ సోషల్ మీడియానే ఉందనే అనుమానం తనకు ఉందన్నారు. తనపై జరుగుతున్న ఈ కుట్రపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూస్తానన్నారు. మంత్రి కేటీఆర్ కు కవిత ఒక్కరే సోదరినా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. తెలంగాణ ఆడబిడ్డల గౌరవ మర్యాదలతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో తనకు న్యాయం జరగాలని లేకుంటే ఈ రాష్ట్రంలో కవితకో న్యాయం సామాన్య మహిళలకు ఓ న్యాయం అమలవుతుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
Also Read...
MLC కవిత ప్రతిస్పందన చిన్న పిల్లల ప్రకటనలా ఉంది: సుకేశ్ లాయర్