- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ హయాంలో దేశంలో విద్వేషం పెరిగింది.. Rahul Gandhi
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో విద్వేషం పెరిగిందని ఆరోపించారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు దేశాన్ని విభజిస్తున్నాయని అన్నారు. దేశంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆదివారం ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో 'మెహంగై పర్ హల్లా భోల్' పేరుతో చేపట్టిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. మోడీ ప్రభుత్వ విధానాలు ఇద్దరు పారిశ్రామికవేత్తలకే ప్రయోజనం చేకూరుస్తున్నాయని విమర్శించారు. వారి సహకారం లేకుండా మోడీ ప్రధాని కాలేరని అన్నారు. ఎయిర్ పోర్టులు, సీ పోర్టులు, రోడ్లు అన్నింటిని ఇద్దరు వ్యక్తులే స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 'బీజేపీ ఆరెస్సెస్‌లు దేశాన్ని విడదీస్తున్నాయి. భయాన్ని పెంచి ప్రజలను వేరు చేస్తున్నారు. ఈ భయంతో ప్రయోజనం పొందేది ఎవరు? మోడీ ప్రభుత్వంతో పేదలు, చిరువ్యాపారులు ఏమైనా ప్రయోజనం పొందుతున్నారా? కేవలం ఇద్దరికి మాత్రమే లాభం చేకూరుతుంది' అని అన్నారు.
ప్రతిపక్షాలకు అనుమతివ్వట్లే..
నిత్యవసరాలపై ధరల పెంపుతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, చైనా ఉద్రిక్తతలు వంటి అంశాలపై పార్లమెంటులో ప్రస్తావించేందుక ప్రతిపక్షాలను అనుమతించట్లేదని తెలిపారు. విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ, నరేంద్రమోడీ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారని విమర్శించారు. వీటితో చైనా, పాకిస్తాన్ లు ప్రయోజనం పొందుతున్నాయని పేర్కొన్నారు. గత 8 ఏళ్లలో మోడీ దేశాన్ని బలహీనం చేశారని అన్నారు. తాము చైనా దాడులు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలపై మాట్లాడుదామంటే అడ్డుకుంటున్నారని అన్నారు. మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్ అన్ని ఒత్తిడిలో ఉన్నాయని విమర్శించారు. మరో వైపు కాంగ్రెస్ దేశాన్ని ఐక్యం చేసిందని చెప్పారు. దేశంలో విద్వేషాన్ని పారద్రోలామని దాంతో దేశం పురోగతిలో వేగం పుంజుకునేందుకు కారణమయ్యామని తెలిపారు.
జోడో యాత్రతో ప్రజలతో మమేకం
దేశవ్యాప్తంగా ప్రజలతో మమేకం అయ్యేందుకు భారత్ జోడో యాత్రను వినియోగించుకుంటామని రాహుల్ చెప్పారు. ఈ యాత్రతో సామాన్య ప్రజలను కలిసి, కేంద్రం చెబుతున్న అబద్దాలను, కేంద్ర సంస్థలను తప్పుగా ఉపయోగించడం వారికి తెలియజేస్తామని అన్నారు. తనను ఈడీ 55 గంటల పాటు ప్రశ్నించిందని, మరో 100 ఏళ్లు విచారించిన పట్టించుకోనని చెప్పారు. వీటన్నింటికి వ్యతిరేకంగా ఎదురుతిరగాలని ఉద్ఘాటించారు. దేశం కేవలం ఇద్దరి సొత్తు కాదని, రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువతది కూడా అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ కీలక నేతలు, ఇతర కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా, ఈ నెల 7 నుంచి కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను ప్రారంభించనుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 12 రాష్ట్రాల గుండా 3,500 కిలోమీటర్ల దూరం సాగనుంది. 150 రోజుల్లో యాత్రను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నేతలతో పాటు ఆయా రాష్ట్రాల నేతలు కూడా దీనిలో భాగం కానున్నారు. కాగా, ఈ సమావేశానికి కట్టుదిట్టంగా పోలీస్ యంత్రాంగం భద్రతను కల్పించింది. సభా ప్రాంగణానికి సమీపంలో ట్రాఫిక్ అంక్షలు విధించింది. ముందు జాగ్రత్తగా పారా మిలిటరీ సిబ్బందిని మోహరించారు.
Also Read : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో సరికొత్త నినాదం
- Tags
- rahul gandhi