- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌కు బీజేపీ టెన్షన్.. చక్రం తిప్పిన డీకే అరుణ
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండటంతో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేసింది. ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన నేతలను చేర్చుకుని క్రమంగా బలోపేతమవుతున్న కమలం పార్టీ రాబోయే ఎన్నికల నాటికి అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుంది. ఆ పార్టీలోని అసంతృప్తిగా ఉన్న నేతలతో పాటు రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గానికి చెందిన నాయకులకు కాషాయదళంలోకి చేర్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. హస్తం పార్టీ నేతల చేరికలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కీలకంగా వ్యవహరిస్తోంది.
కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈనెల 25వ తేదీన ఢిల్లీ వేదికగా ఆయన కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. ఈయనను బీజేపీలోకి తీసుకురావడంలో డీకే అరుణ కీలకంగా వ్యవహరించింది. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన ఆమెకు అక్కడి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి చేర్చుకోవడం సులువుగా మారనుంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గంతో పాటు కాంగ్రెస్ లో బలమైన నేతలను కాషాయదళంలోకి లాక్కొని బీజేపీని బలోపేతం చేయాలని నిర్ణయించుకుంది. మర్రి శశిధర్ రెడ్డి రాక అనంతరం కాంగ్రెస్‌కు చెందిన మరో కీలక నేతను కూడా డీకే అరుణ బీజేపీలోకి తీసుకురానున్నట్లు సమాచారం.
తెలంగాణ పీసీసీగా రేవంత్ రెడ్డి నియామకమయ్యాక ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీలో ఉన్న పలువురు కీలక నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. వారిని బీజేపీలోకి తీసుకొస్తే పార్టీ బలోపేతంతో పాటు కాంగ్రెస్ ఖాళీ అయితే తమకు ఎదురుండని భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి చేర్చుకోవడంపై దృష్టిపెట్టిన డీకే అరుణ తనదైన మార్క్ ను చూపాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. జాయినింగ్స్ స్పీడప్ చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ పై తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. రేవంత్ అంటే గిట్టని వారితో పాటు ఆయనకు సన్నిహితంగా ఉన్నవారిని చేర్చుకోవడంపై కూడా దృష్టిసారిస్తున్నారు.
చేరికలను వేగవంతం చేయాలని నిర్ణయించుకున్న బీజేపీ చేరే వారికి సంబంధించిన విషయాలను మూడో కంటికి కూడా తెలియనివ్వకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. డీకే అరుణ కూడా కాంగ్రెస్ నేతలను చేర్చుకునేందుకు ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. సంఘం బ్యాక్ గ్రౌండ్ ఉన్న పలువురిని తమ టీంలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. వారైతే ఇతరులకు లీక్ కాకుండా ఉండటంతో పాటు నిబద్ధతతో పనిచేస్తారనే ఉద్దేశ్యంతో ఆమె కొంతమంది సభ్యులను చేర్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా సోషల్ మీడియా టీం కూడా ఏర్పరుచుకున్నట్లు వినికిడి.