ఢిల్లీ లిక్కర్ కేసు: 5 రోజుల సీబీఐ కస్టడీకి మనీశ్ సిసోడియా

by Javid Pasha |
ఢిల్లీ లిక్కర్ కేసు: 5 రోజుల సీబీఐ కస్టడీకి మనీశ్ సిసోడియా
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ ఐదు రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీశ్ సిసోడియాను కీలక నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఆదివారం ఆయనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సోమవారం మనీశ్ సిసోడియాను రౌజ్ అవెన్యూ కోర్టులో సీబీఐ ప్రవేశపెట్టింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీశ్ సిసోడియాది కీలక పాత్ర అని, ఈ కేసులో విచారించడానికి మనీశ్ సిసోడియాను 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోర్టును కోరింది. తొలుత మనీశ్ రిమాండ్ ను రిజర్వ్ చేసిన కోర్టు.. తుది వాదనలు విన్న తర్వాత మనీశ్ ను సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది.

Advertisement

Next Story

Most Viewed