- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పవన్ కల్యాణ్‌పై విమర్శలు.. బర్రెలక్క రియాక్షన్ ఇదే!

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అందులో గెలవక పోయినా 5754 ఓట్లు సాధించింది. ప్రజల మనసులు గెలుచుకుంది. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా 8 చోట్ల పోటీ చేశారు. కానీ ఏ చోట గెలవలేదు. దీంతో కొందరు ప్రముఖులు పవన్ కల్యాణ్ కంటే బర్రెలక్క నయం అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా నిత్యం ఎవరో ఒకరు పవన్‌పై విమర్శలు చేయడం మొదలెట్టారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బర్రెలక్క స్పందించింది. ‘‘ ఎవరి పార్టీ వారిది. ఎవరి రాజకీయం వారిది. పవన్ కల్యాణ్‌ను తక్కువ చేసి మాట్లాడటం నాకు బాధగా అనిపించింది. ఆయన పవర్ ఆయనది నాది నాదే. నేను పవన్ అభిమానిని ఆయన చాలా మంచివారు. పవన్ కల్యాణ్ చాలా గ్రేట్ పర్సన్. ఆయనను మైనస్ చేయడానికి నన్ను వాడటం కరెక్ట్ కాదు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బర్రెలక్క చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.