- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నిర్మలా సీతారామన్ అందంగా ఉంటారు.. CPI నారాయణ షాకింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై సీపీఐ జాతీయ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మలా సీతారామన్ అందంగా ఉంటారు.. అంతే అందంగా అబద్ధాలు చెబుతారు అని అన్నారు. ఎన్డీఏ కూటమిలోని పార్టీల పాలిత రాష్ట్రాలకు తప్పా మిగిలిన రాష్ట్రాలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో అన్యాయం చేశారని అన్నారు. కూటమిలో చంద్రబాబు, నితీష్ లేకపోతే ప్రభుత్వం పడిపోతుందని విమర్శించారు. మోడీతో ఫ్రెండ్షిప్ మాత్రమే కాదని.. రాష్ట్రానికి చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురావాలని సూచించారు. అనంతరం మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనంపై సీపీఐ నారాయణ స్పందించారు. ఫైళ్లు తగులబెట్టడం రాష్ట్రంలో కామన్ అయిపోయిందని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు, ఎన్నికల ఫలితాలప్పుడు ఇలాంటి సర్వసాధారంగా జరుగుతున్నాయని అన్నారు. వచ్చే నెల 4వ తేదీన మదనపల్లి బాధితులను కలుస్తామని ప్రకటించారు.