40 మందితో కర్ణాటక స్టార్ క్యాంపెయినర్ల జాబితా రిలీజ్

by Javid Pasha |
40 మందితో కర్ణాటక స్టార్ క్యాంపెయినర్ల జాబితా రిలీజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే నెల 10వ తేదీన జరగనున్న కర్ణాటక ఎన్నికల ప్రచారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టిన హస్తం పార్టీ మొత్తం 40 మందితో కూడిన లిస్ట్ ను బుధవారం ప్రకటించింది. ఈ స్టార్ క్యాంపెయినర్లలో తెలంగాణ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అజారుద్దీన్ కు చోటు లభించింది.

వీరితో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భగేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్ తదితరులకు చోటు కల్పించారు. మరో వైపు కర్ణాటక ఎన్నికల కోసం బీజేపీ సైతం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ విడుదల చేసింది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు స్థానం కల్పించారు.

Advertisement

Next Story