- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కు స్వల్ప అస్వస్థత.. 48 గంటలు విశ్రాంతి అవసరమన్నా డాక్టర్లు
దిశ, జడ్చర్ల: పీపుల్స్ మార్చ్ పేరిట గత 62 రోజులుగా పాదయాత్ర చేస్తున్న తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క షుగర్ లెవెల్స్ తగ్గడంతో గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలం రుక్కంపల్లి వద్ద అస్వస్థకు గురైన ఆయనకు డాక్టర్ వినోద్ కుమార్ గౌడ్ బస శిబిరం వద్దకు వచ్చి ఆరోగ్యాన్ని పరీక్షించారు. షుగర్ లెవెల్స్ తగ్గాయని తెలిపారు. ఎండలకు వందల కిలోమీటర్లు దూరం నడవడం వల్ల ఫ్లూయిడ్స్ బాగా తగ్గాయని చెప్పారు. తీవ్రమైన ఎండలకి వందల కిలోమీటర్లు నడవడం వల్ల వడ దెబ్బ, డీ హైడ్రేషన్ కు భట్టి విక్రమార్క గురయ్యారని డాక్టర్ ధ్రువీకరించారు.
ఈ నేపథ్యంలో 48 గంటల పాటు భట్టి విక్రమార్కకు పూర్తిగా అబ్జర్వేషన్ అవసరం అని చెప్పారు. డాక్టర్ల సూచనల మేరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర రేపు, ఎల్లుండి (19, 20 తేదీల్లో) పాదయాత్రకు విరామం ప్రకటించారు. కాగా గురువారం కూడా భట్టి విక్రమార్క కర్ణాటకలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఒకరోజు బ్రేక్ ఇచ్చారు కాగా నేడు తాజాగా అస్వస్థతో మరో రెండు రోజులపాటు పాదయాత్రకు బ్రేక్ పడింది. భట్టి విక్రమార్క కు అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానంపల్లి అనిరుద్ రెడ్డి భట్టి విక్రమార్క శిబిరం వద్ద ఉండి ఆయన ఆరోగ్య విషయంలో అన్ని తానై చూసుకుంటున్నారు.