ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం డేట్ మార్పు.. మళ్లీ ఎప్పుడంటే..?

by Indraja |   ( Updated:2024-06-06 04:47:28.0  )
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం డేట్ మార్పు.. మళ్లీ ఎప్పుడంటే..?
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో 164 సీట్లను సాధించి భారీ మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కూటమిలో భాగమైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఈ నెల 9న ముహూర్తం సైతం ఖరారు చేశారు. అయితే అనివార్య కారణాల చేత ప్రమాణస్వీకారం తేదీని 12 వ తేదీకి మార్చారు.

జూన్ 12న మధ్యహానం 12గంటలకి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం అమరావతిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రమణస్వీకారం చేసే వేధికను ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

Advertisement

Next Story