ప్రధాని రాష్ట్ర పర్యటన రద్దు.. హుటాహుటిన ఢిల్లీకి Bandi Sanjay Kumar

by GSrikanth |   ( Updated:2023-01-12 02:33:18.0  )
ప్రధాని రాష్ట్ర పర్యటన రద్దు.. హుటాహుటిన ఢిల్లీకి Bandi Sanjay Kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుటాహుటిన సోమవారం రాత్రి హస్తినకు వెళ్లి వచ్చారు. హస్తిన టూర్‌లో కీలక అంశాలపై చర్చలు జరిగినట్టు సమాచారం. ఆయన ఢిల్లీ టూర్ అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోడీ టూర్ రద్దయింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఈనెల 28న తెలంగాణకు రానున్నారు. ఉన్న పళంగా బీజేపీ వ్యూహాలు మార్చుకోవడం వెనుక ఏదో సంచలనం జరగబోతున్నదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది సస్పెన్స్ గా మారింది. ఈనెల 16, 17 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మీటింగ్‌లో తెలంగాణపై ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై చర్చ సాగుతున్నది. దక్షిణాదిపై గురి పెట్టిన కాషాయదళం.. వచ్చే ఎన్నికలే ప్రధాన ఎజెండాగా సెషన్ సాగనున్నట్టు సమాచారం. తెలంగాణకు చెందిన నేతలకు ఇప్పటికే బీజేపీ హైకమాండ్ ప్రయారిటీ ఇస్తున్నది. ఇప్పటికే పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగుతున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గంలో అదనంగా ఇంకా ఎవరికైనా అవకాశం కల్పిస్తారా? రాష్ట్ర కార్యవర్గంలో మార్పులు చోటుచేసుకుంటాయా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. ఇటీవలో కొద్దిరోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండబోతున్నదని జోరుగా ప్రచారం జరుగుతున్నది. కాగా ఈ సమావేశంలో దీనికి ఫుల్ స్టాప్ పెట్టనున్నట్టు సమాచారం. బండిని యథావిధిగా కొనసాగిస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారని విశ్వసనీయ సమాచారం.

ప్రధాని పర్యటన రద్దు

వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభానికి ఈ నెల 19న మోడీ సికింద్రాబాద్‌ కు వస్తారని మొదట ప్రకటించినా.. తర్వాత ఆ పర్యటనను రద్దు చేశారు. దీని వెనుక ఉన్న కారణాలేంటి అన్న విషయంపై సైతం చర్చలు మొదలయ్యాయి. కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలున్న నేపథ్యంలో ఆయన రాలేకపోతున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది. దీనికితోడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈనెల 16, 17 తేదీల్లో జరగడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల 28న తెలంగాణకు రానున్నారు. ఎన్నికల సంసిద్ధతపై దిశానిర్దేశంతో పాటు పార్టీ సంస్థాగత అంశాలపై వివిధ స్థాయి నేతలతో ఆయన సమావేశం కానున్నట్లు సమాచారం. అంతేకాకుండా సంఘ్ కార్యకర్తలతోనూ ఆయన భేటీ కానున్నారని టాక్. ఖమ్మం జిల్లాలోనూ ఆయన పర్యటించే అవకాశాలున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్నది. ఈనెల 18న అమిత్ షాతో భేటీ కానున్నట్టు తెలుస్తున్నది. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ నిర్వహించి జాయిన్ అవుతారని రాజకీయవర్గాల్లో టాక్. కాగా అమిత్ షా ఖమ్మం పర్యటనలోనే ఆయన కాషాయతీర్థం పుచ్చుకుంటారా? లేక ముందుగా నిర్ణయం తీసుకున్న ప్రకారం ఫిబ్రవరిలోనే జాయిన్ అవుతారా? అనేది ఇంట్రెస్టింగ్ మారింది.

కేబినెట్‌లో తెలంగాణ నుంచి మరొకరు?

కేంద్ర క్యాబినెట్​విస్తరణ త్వరలోనే జరగనున్న నేపథ్యంలో తెలంగాణను నుంచి బండి సంజయ్, లక్ష్మణ్, అర్వింద్, సోయం బాపురావులో ఎవరికో ఒకరికి చాన్స్ ఉందని ప్రచారం జరుగుతున్నది.​మరి ఈ సమయంలోనే బండి సంజయ్​ ఢిల్లీ వెళ్లిరావడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. మంత్రి వర్గంలో చాన్స్​కోసమే ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందా? పార్టీ విషయంలపై చర్చించేందుకు పిలిచారా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఇవి కూడా చదవండి : సీఎస్ సెలెక్షన్ వెనుక కేసీఆర్ సీక్రెట్ ఎజెండా!

Advertisement

Next Story