- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈటలపై మునుగోడు బీజేపీ సీరియస్.. బండి సంజయ్‌కు ఫిర్యాదు
దిశ, తెలంగాణ బ్యూరో: జాయినింగ్స్ కమిటీ కన్వీనర్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై మునుగోడు లీడర్లు గుస్సా అవుతున్నారు. ఆయనపై రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. టీఆర్ఎస్ చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి చేరికే ఇందుకు కారణమైంది. ఆఫీస్ బేరర్ల మీటింగ్ అనంతరం స్థానిక బీజేపీ నేతలు బండి సంజయ్ వద్ద మొరపెట్టుకున్నట్లు తెలిసింది. తాడూరిపై పలు కేసులున్నాయని, అలాంటి వ్యక్తిని ఈటల దగ్గరికి చేర్చుకుని వెంటే తిప్పుకుంటున్నారని చెప్పినట్లు సమాచారం. ఆయన చేరికకు సంబంధించి కనీసం స్థానిక నేతలకు కూడా సమాచారం ఇవ్వలేదని వాపోయినట్లు చెబుతున్నారు. కనీసం మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కూడా చెప్పకపోవడం అవమానించడమేనని బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇప్పుడిప్పుడే పార్టీ బలోపేతమవుతున్న తరుణంలో ఎవరినీ సంప్రదించకుండా, ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించినట్లు తెలిసింది. కాగా, అందరూ కలిసి పనిచేయాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సూచించినట్లు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీకి ఎంతో కీలకమని, ఈ ఎలక్షన్‌లో గెలుపు అవసరమని స్థానిక నేతలకు దిశానిర్ధేశం చేసినట్లు చెబుతున్నారు. నేతల కోపాన్ని అర్థం చేసుకుంటానని చెప్పినట్లు సమాచారం. బీజేపీ అధికారంలోకి రావాలంటే మునుగోడు అత్యంత కీలకమని, అందరం కలిసి పనిచేస్తేనే విజయం సాధ్యమని ఆయన సూచించినట్లు చెబుతున్నారు. పార్టీకి ఇబ్బంది కలిగించే పనిని నేతలెవరూ చేయొద్దని రిక్వెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. బీఎస్‌కే సర్దిచెప్పడంతో స్థానిక నేతలు శాంతించినట్లు సమాచారం.