- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా బారిన పడిన పోలాండ్ అధ్యక్షుడు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెడుతోంది. ముఖ్యంగా యూరప్ దేశాలు కరోనా భయంతో విలవిల్లాడుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఆ దేశాలు మళ్లీ వైరస్ దాడికి వణికిపోతున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, యూకె, స్పెయిన్ వంటి దేశాల్లో వైరస్ తీవ్రత అత్యధికంగా ఉంది. వీటితో పాటు పోలాండ్‌లో రోజూ పదివేల కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.
ఈ క్రమంలోనే పోలాండ్ అధ్యక్షుడు ఆంద్రేజ్ దుడా కూడా కరోనా బారిన పడ్డారు. పోలాండ్ విదేశాంగ మంత్రి బ్లెబెజ్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుత క్వరంటైన్‌లో ఉన్నట్టు ఆయన తెలిపారు. కాగా, ఆంద్రేజ్‌కు కరోనా ఎప్పుడు సోకిందనే విషయంపై పోలాండ్ అధికారులు స్పష్టత ఇవ్వలేదు.
పోలాండ్‌లో మార్చి నెలతో పోలిస్తే ప్రస్తుత వైరస్ తీవ్రత భయంకరంగా ఉందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. పలు ప్రాంతాలను రెడ్ జోన్‌లుగా పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేశామన్నారు. ఇప్పటివరకు పోలాండ్‌లో మొత్తం 2.28 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో 4 వేల కంటే ఎక్కువమంది ప్రాణలు పోగొట్టుకున్నారు.