- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోత్కూర్: విద్యుత్ ఉద్యోగులకు పోలీస్ వార్నింగ్
దిశ ప్రతినిధి, నల్లగొండ: విధుల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగుల పట్ల పోలీసుల ప్రవర్తన వివాదాస్పదంగా మారుతోంది. ఉద్యోగులపై నల్లగొండలో జరిగిన ఘటన మరిచిపోకముందే మోత్కూర్‌లో సోమవారం విద్యుత్ ఉద్యోగుల పట్ల ఓ ఎస్‌ఐ ప్రవర్తించిన తీరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది
పూర్తి వివరాల్లోకి వెళితే..
మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో సోమవారం విద్యుత్ సిబ్బంది బిల్లుల కోసం డోర్ టు డోర్ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే టూ వీలర్‌పై సంచరిస్తూ.. హెల్మెట్ లేకుండా ఎస్ఐ ఉదయ్ కిరణ్ కంట పడ్డారు. విద్యుత్ ఉద్యోగులను చెక్‌పోస్టు వద్ద నిలిపివేసి.. మీ ఉన్నతాధికారులు ఏమైనా హెల్మెట్ లేకుండా విధులు నిర్వహించమని ఆదేశాలు ఇచ్చారా.. ఇస్తే చూపించండి అంటూ సిబ్బంది చేత ఫోటోలు తీయించారు. ఇల్లు ఇల్లు తిరుగుతున్నామని హెల్మెట్ ధరించలేమని సిబ్బంది చెప్పగా.. కాలినడకన విధులు నిర్వహించాలని హెల్మెట్ లేకపోతే చలాన్ విధించక తప్పదని ఎస్.ఐ హెచ్చరించారు.
ఎస్‌ఐ తీరుపై విద్యుత్ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో ఉన్నప్పుడు తమను బెదిరించడం ఏంటని.. చలాన్‌లు విధిస్తే కట్టే పరిస్థితుల్లో లేమని చెబుతున్నారు. ఇదే విషయంపై ట్రాన్స్‌కో ఏఈకి కూడా మొరపెట్టుకున్నారు. అయితే, వివరణ కోసం ఎస్‌ఐకి కాల్ చేసినా స్పందించలేదని ఏఈ వాపోయారు.