బైక్ కొంటున్నారా.. మీ కోసమే తెలంగాణ పోలీసుల ముఖ్య గమనిక

by Anukaran |   ( Updated:2021-08-28 04:18:27.0  )
బైక్ కొంటున్నారా.. మీ కోసమే తెలంగాణ పోలీసుల ముఖ్య గమనిక
X

దిశ, వెబ్ డెస్క్ : మీరు బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే షోరూం వాళ్లు బైక్‌తో పాటు రెండు హెల్మెట్‌లు ఇవ్వాల్సిందే. అవును ఇలా అని మోటారు వాహన చట్టం-1989లో ఉంది. నిత్యం జరుగుతున్న ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు.

దీనిపై దృష్టి సారించిన సైబరాబాదు పోలీసులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహన తయారీదారులు తమ కస్టమర్ సేఫ్టీని పరిగణించాలని తప్పనిసరిగా రెండు హెల్మెట్‌లు అందించాలని తెలిపారు. అంతేకాకుండా ఈ హెల్మెట్‌లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) ప్రకారం ఉండాలని సూచించారు.

ఈ క్రమంలో వినియోగదారులు దీనిపై అవగాహన కలిగి ఉండి తమ హక్కు అయిన ఉచిత హెల్మెట్‌ను పొందాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ద్విచక్ర వాహనంపై వెళ్లే ఇద్దరికి హెల్మెట్ ఉండాలనే నిబంధన నడుస్తోంది. హైదరాబాద్‌లో ఇది పకడ్బంధీగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షోరూమ్స్.. చట్టంలోని నిబంధనలు అమలుచేసి ఖచ్చితంగా రెండు హెల్మెట్స్ ఇవ్వాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed