భారీగా రేషన్ బియ్యం పట్టివేత

by Shyam |
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
X

దిశ, పటాన్‌చెరు: నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జహీరాబాద్, బీదర్ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను పటాన్‌చెరు పోలీసులు ముత్తంగి టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం… నగరంలోని ఘట్‌కేసర్ ఇతర ప్రాంతాల నుంచి ఇంటింటికి తిరిగి 342 క్వింటాళ్ల రేషన్ బియ్యం సేకరించారు. బుధవారం రాత్రి నగరం నుంచి ఔటకం రింగ్ రోడ్డు మీదుగా 10 వాహనాలలో జహీరాబాద్, బీదర్ ప్రాంతాలకు తరలిస్తుండగా ముత్తంగి ఓఆర్ఆర్ టోల్ ప్లాజా వద్ద పటాన్‌చెరు పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 10 వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, 10 వాహనాలను సీజ్ చేసి, పది మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story