- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువతుల ఫొటోల మార్ఫింగ్.. రూ.2 కోట్లు గుంజిన కేటుగాడు
దిశ, వెబ్ డెస్క్: అమ్మాయిల మెతక వైఖరి, భయాన్ని ఆసరాగా తీసుకోని ఓ కన్నింగ్ యువకుడు రెచ్చిపోయాడు. యువతుల ఫొటోలనే పెట్టుబడిగా పెట్టి సుమారు రూ.2కోట్ల వరకు దండుకున్నాడు. ఓసారి జైలుకు వెళ్లొచ్చినా తన బుద్ది మార్చుకోకుండా క్రిమినల్ పనులకు తెగబడ్డాడు ఈ సైబర్ నేరగాడు.
వంశీ. ఈ పేరు సైబర్ క్రైం పోలీసులకు, తెలుగు రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడే వారికి సుపరిచితమే. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు సంపాదించడం ఇతడి నైజం. తాజాగా ఇతడి ఉచ్చులో మరో 100 మంది యువతులు చిక్కుకున్నారు. వారంతా మెడికల్ స్టూడెంట్స్ కావడం గమనార్హం. వారి ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ నుంచి సేకరించి మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మెడికల్ స్టూడెంట్స్ అతడి వల్లలో చిక్కారు. వారి ఫొటోలను నగ్నంగా మార్పింగ్ చేసి ఇప్పటి వరకు రూ.2 కోట్లు దండుకున్నట్లు సమాచారం. ఇదే కేసులో నిందితుడు వంశీని గతంలో హైదరాబాద్, రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి బారినపడిన ఓ యువతి తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలో దిగిన పోలీసులు నిందితుడు వంశీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.