మామిడితోటలో వరద బాధితులు సేఫ్

by srinivas |
మామిడితోటలో వరద బాధితులు సేఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: నివర్ తుఫాను ఎఫెక్ట్‌తో ఏపీలో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని సదాశివ కోనశివగిరి కాలనీ మొత్తం మునిగిపోయింది. దీంతో నిన్నటి నుంచి మామిడి తోటలోనే ఏడుగురు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఇక వారిని బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. పోలీసుల సమయస్ఫూర్తితో బాధితులను క్షేమంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయకచర్యలను కొనసాగిస్తున్నారు.

Next Story

Most Viewed