- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాల కార్మికులతో పనులు చేయిస్తున్న యజమానులపై కేసు
దిశ ,కంటోన్మెంట్: బాల కార్మికులతో పనిచేయిస్తున్న రెండు మెకానిక్ షాపుల యాజమానులపై బోయిన్ పల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం.. బోయిన్ పల్లి చెక్ పోస్టు సమీపంలోని యాదవ్ పార్కింగ్ స్థలంలో ని జెజె మెకానిక్ దుకాణం యాజమాని మోయిజ్, అదేప్రాంతంలోని ఫయిమ్ ఆటో ఎలక్ట్రికల్స్ యాజమాని అబ్దుల్ ఫయిమ్‌లు ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన మహమ్మద్ రెహాన్(13), మహమ్మద్ ఇబ్రహీం(17)లతో తమ దుకాణాల్లో పనిచేయిస్తున్నారు.
సమాచారం అందుకున్న కార్మిక శాఖ అధికారులు ఆదివారం రెండు దుకాణాలలో దాడులు నిర్వహించారు. రెహాన్,ఇబ్రహీంలను రామాంతపూర్‌లోని హోమ్ కు తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మైనర్లతో తమ దుకాణాలలో పనులు చేయిస్తున్న మోయిజ్, అబ్దుల్ ఫయిమ్ లపై కార్మిక శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.