నేడు పుంగనూరుకు నిమ్మగడ్డ.. అభ్యంతరం తెలిపిన పోలీసులు

by srinivas |   ( Updated:13 Feb 2021 10:43 PM  )
నేడు పుంగనూరుకు నిమ్మగడ్డ.. అభ్యంతరం తెలిపిన పోలీసులు
X

దిశ,వెబ్‌డెస్క్: నేడు పుంగనూరులో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పర్యటించనున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై పరిశీలన చేయనున్నారు. కాగా పర్యటన కోసం ఏర్పాట్లు చేయాలని పోలీసులకు ఆయన చెప్పారు. అయితే ఆయన పర్యటనకు పోలీసు అధికారులు అభ్యంతరం తెలిపారు.

ఆయన పర్యటన శాంతి భద్రతల సమస్యగా మారే అవకాశం ఉందని పోలీసులు అన్నారు. కోర్టు తీర్పుతో పుంగనూరులో పర్యటించి ఏకగ్రీవాలపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎస్ఈసీ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పుంగనూరులో ఆయన పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.

Next Story