- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICUలో హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి.. పరిస్థితి సీరియస్!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విద్యార్థి నిరుద్యోగ సైరన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు నిరాకరించినప్పటికీ కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి, ర్యాలీగా ఎల్బీ నగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించారు. అయితే, ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య జరిగిన వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. ఈ లాఠీచార్జ్‌లో హుజురాబాద్ అభ్యర్థి, NSUI ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్‌కు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వెల్లడించారు. దీంతో హుటాహుటిన వెంకట్‌ను కొత్తపేట ఓమ్ని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందజేస్తున్నట్లు వెంకట్ బల్మూరి ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#VidyardhiNirudhyogaSiren కార్యక్రమనికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకుని లాఠీ ఛార్జ్ చేయడం జరిగింది. ఈ సంఘటనలో వెంకట్ బల్మూర్, @TSNSUI అధ్యక్షుడు గారికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి పోయారు. అనంతరం వారిని కొత్తపేట ఓమ్ని ఆసుపత్రి లో అడ్మిట్ చేయడం జరిగింది.#Adminpost pic.twitter.com/Cojm06Gjw2
— Venkat Balmoor (@VenkatBalmoor) October 2, 2021