భార్యను చంపిన హెడ్ కానిస్టేబుల్

by Sumithra |
భార్యను చంపిన హెడ్ కానిస్టేబుల్
X

న్యూఢిల్లీ: ఓ హెడ్ కానిస్టేబుల్ తన భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన దక్షిణ ఢిల్లీలోని లోధి కాలనీలో చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. మనోజ్ అనే హెడ్ కానిస్టేబుల్ తన మొదటి భార్యకు విడాకులిచ్చి 2010వ సంవత్సరంలో మహిళా కానిస్టేబుల్ రేణు మాలిక్‌ను (33) వివాహం చేసుకున్నాడు. గత కొంత కాలంగా ఇద్దరు అభిప్రాయబేధాలతో గొడవపడుతున్నారు. తన భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధమున్నదని మనోజ్ అనుమానిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే మంగళవారం లోధి రోడ్డులో కారులోపల మహిళ కానిస్టేబుల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెపై పోలీస్ రివాల్వర్ తో కాల్పులు జరిపారని, మృతదేహానికి సమీపంలో పదునైన ఆయుధాలతో పాటు రివాల్వర్ ఉందని పోలీసులు వెల్లడించారు. డౌరలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జమల్‌పూర్ గ్రామంలో హెడ్ కానిస్టేబుల్ మనోజ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. భార్యను చంపి అనంతరం హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా డిసిపి అతుల్ కుమార్ పేర్కొన్నారు.

tags: crime, police head constable, murder, suicide, killed, delhi

Advertisement

Next Story