తస్మాత్ జాగ్రత్త.. ఇక తప్పుచేయాలంటే ఒకసారి ఆలోచించండి..

by Shyam |   ( Updated:2021-11-25 11:49:35.0  )
తస్మాత్ జాగ్రత్త.. ఇక తప్పుచేయాలంటే ఒకసారి ఆలోచించండి..
X

దిశ, తెలంగాణ బ్యూరో : తప్పుచేయాలంటేనే దొంగలు బయపడే రోజులు వచ్చాయని డీజీపీ మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు వ్యవస్థ మరింత మెరుగుపడిందన్నారు. గురువారం ఎల్బీనగర్ లో సీసీ కెమెరాల ఏర్పాటుపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.7కోట్ల నిధుల కేటాయింపు పత్రాన్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అందజేశారు. సామాజిక సేవా సంస్థల ద్వారా 500 సీసీ కెమెరాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్, షీ టీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, సీ.సీ.కెమెరాల పై ప్రజల్లో అవగహన కల్పించామని తెలిపారు.

ఇంటి నిర్మాణ సమయంలోనే సీ.సీ.కెమెరాలు అమర్చుకోవాలనే నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. సీ.సీ.కెమెరాలతో దొంగతనం, చైన్ స్నాచింగ్స్, దోపిడి లాంటివి పూర్తి స్థాయిలో అరికట్టవచ్చన్నారు. ఒక్కో సీ.సీ.కెమెరా వందమంది పోలీసులతో సమానం అని పేర్కొన్నారు. రాబోయే రెండు, మూడేళ్లలో ఎల్.బీ.నగర్ ప్రాంతాన్ని నూరుశాతం సీ.సీ.కెమెరాలతో అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు, ఎల్.బీ.నగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, ఏ.సీ.పీ.లు.శ్రీధర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి , నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు ఎల్.బి.నగర్, సరూర్ నగర్, చైతన్య పూరి, వనస్థలిపురం, మీర్ పేట ఇన్స్పెక్టర్లు, ఎస్.ఐ.లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed