- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ వెబ్‌సైట్‌తో జనాలకు టోకరా..
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు, నకిలీ వస్తువులు విపరీతంగా పెరిగిపోయారు. దేశంలో పేరుగాంచిన ప్రముఖుల పేరుతో అక్రమాలు సృష్టిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో నకిలీ ముఠా వెబ్‌సైట్ నడిపిస్తోంది. ఈ ముఠాను బుధవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని పేరుతో నకిలీ సైట్ క్రియేట్ చేసి, పిల్లలకు బీమా అంటూ వేల మంది నుంచి డబ్బులు లాగినట్టు సమాచారం.
‘ప్రధానమంత్రి శిశు వికాస్ యోజన’ అనే నకిలీ వెబ్‌సైట్ నడిపిస్తూ, దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులందరూ బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అరెస్టయిన వారిలో బిహార్‌కు చెందిన నీరజ్ పాండే, సువేందర్ యాదవ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆదర్శ్ యాదవ్‌లు అని తెలిపారు. ఇప్పటికే వీరు నడిపిస్తున్న నకిలీ వెబ్‌సైట్‌లో 15 వేల మంది ప్రజలు తమ పేరును నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.