పెళ్లి ఇష్టం లేకనే ప్రాణం తీసుకున్నాడా?

by Shyam |
పెళ్లి ఇష్టం లేకనే ప్రాణం తీసుకున్నాడా?
X

దిశ, మేడ్చల్: పెళ్లి సంబంధం ఇష్టంలేక ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. ములుగు జిల్లా వాజేడు మండలం ట్రజల పల్లి గ్రామానికి చెందిన సూరిబాబుకు ఇద్దరు కుమారులు. నాగ సాయి చందు(25) పెద్ద కుమారుడు. 2018లో కానిస్టేబుల్‌గా ఎంపికై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ బ్రాంచ్ నందు గత రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడు.

అయితే, మేడిపల్లిలోని విహారిక కాలనీలో నివాసముంటున్న చందు‌కు.. తల్లిదండ్రులు వివాహ సంబంధం చూసి పెళ్లి చేసుకోవాలని చెప్పారు. దీనికి నిరాకరించిన నాగ సాయి చందు ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. శవాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కాగా, నాగ సాయి చందు మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయనకు పెళ్లి సంబంధం ఇష్టంలేకనా, ఇంకేమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed