ఇయర్ ఫోన్ డ్రైవింగ్.. టువార్డ్స్..!

by Shamantha N |   ( Updated:2020-02-25 04:23:45.0  )
ఇయర్ ఫోన్ డ్రైవింగ్..  టువార్డ్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఈ మధ్య రోడ్డు మీద ఎక్కడ చూసినా చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని కనిపిస్తుంటారు. నడిచే వాళ్ల సంగతి పక్కన పెడితే చివరికి బండి నడిపే వారు, ఆటోలు నడిపే వారు కూడా ఇయర్ ఫోన్లు పెట్టుకుని నడపడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. బండి నడిపే వారంటే ప్రాణం వారిదే కాబట్టి ఇయర్ ఫోన్ చెవిలో ఉన్నప్పటికీ కొద్దిగా జాగ్రత్తగా నడుపుతారనుకోవచ్చు. కానీ ఆటోవాలాలు అలా కాదు.. వారిని నమ్ముకొని ఒక అపరిచిత కుటుంబమే వారి ఆటోలో కూర్చునే అవకాశం ఉంది. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ హైదరాబాద్‌లో పాతబస్తీ లాంటి ఏరియాల్లో జాగ్రత్తగా ఆటో నడిపే డ్రైవర్లను వేళ్ల మీద లెక్కించొచ్చు.

అజాగ్రత్తగా ఇయర్ ఫోన్లు పెట్టుకుని పాటలు వింటూ, ఫోన్లు మాట్లాడుతూ ఆటో నడిపే వారికి చెక్ పెట్టడానికి ముంబైలోని థానే పోలీసులు ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. థానే రూరల్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో పనిచేసే పోలీసులు అందరూ వారి పరిధిలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని ఆటో నడుపుతున్న డ్రైవర్లను పట్టుకున్నారు. వారి ఇయర్ ఫోన్లు లాక్కున్నారు. మొత్తంగా ఒక్కరోజులో 250 ఇయర్ ఫోన్లు లాక్కొని ఒక దగ్గర వేసి నిప్పు పెట్టారు. ఈ 250 మందిలో ఏ ఒక్కరు అజాగ్రత్తగా ఉన్నా చాలా ప్రమాదాలు జరిగేవి. అందుకే ఇలాంటి డ్రైవ్ ఏదో హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో సిటీల్లో కూడా అమలు చేస్తే బాగుంటుంది.

కేవలం ఆటో వాళ్లకి మాత్రమే కాకుండా ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకుని అజాగ్రత్తగా నడిపి ఇతరుల ప్రాణాలను బలి తీసుకునే వారందరినీ నియంత్రించడానికి ఒక మెకానిజం ఉంటే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం ట్రాఫిక్ విభాగం వారు అవగాహన సదస్సులు, ట్రైనింగ్ క్లాసులు ఇప్పించాలని వారు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed