రోడ్డుమీదకు వచ్చారో చచ్చారే.. తనిఖీలు చేసేది ఎవరో తెలుసా?

by Shyam |   ( Updated:2021-05-21 23:22:57.0  )
Police Commissioners
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు అధికమవుతుండటంతో తెలంగాణలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే.. హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ ఉన్నా.. జనాలు విచ్చలవిడిగా రోడ్లపైకి వస్తుండటంతో పోలీసులు లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఏకంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, సైదరాబాద్ సీపీ సజ్జనార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌లు రంగంలోకి దిగి మూడు కమిషనరేట్ల పరిధిలో లాక్‌డౌన్‌లు పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని ముఖ్య కూడళ్ల వద్ద జోరుగా తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు కీలక ప్రాంతాల్లో అంజనీకుమార్, సైబరాబాద్‌లోని హైటెక్ సిటీలోని పలు ప్రాంతాల్లో సీపీ సజ్జనార్, ఎల్బీనగర్ హైవేలపై రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్‌లు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లమీదకు వస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ తనిఖీల్లో పలు వాహనాలు సీజ్ చేశారు.

TS Police Commissioners

Advertisement

Next Story

Most Viewed