ఊపిరి పీల్చుకున్న పోలీసులు

by Shyam |
ఊపిరి పీల్చుకున్న పోలీసులు
X

దిశ, భద్రాచలం : మావోయిస్టు పార్టీ అనుబంధ పీఎల్‌జీఏ 20వ వార్షికోత్సవ వారోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఈనెల 2న వారోత్సవాలు ప్రారంభంకాగా, ఈ సమయంలో ఎలాంటి అలజడి, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల మండలాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యలో సీఆర్‌పీఎఫ్, గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు అడవుల్లోకి ప్రవేశించి మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

భద్రాద్రి ఏజెన్సీలో మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో పోలీసులు రేయింబవళ్ళు గస్తీ తిరుగుతూ వారోత్సవాల ప్రభావం పడకుండా కట్టడిచేశారు. అటవీ గ్రామాల నుంచి వచ్చిపోయే వారిపై పోలీసులు డేగకన్ను వేసి ఉంచారు. మావోయిస్టుల కొరియర్ వ్యవస్థపై నిఘా పెట్టారు. ఏ క్షణంలో ఏమౌతుందో అని మన్యంవాసులు… వారోత్సవాల వేళ క్షణక్షణం భయంభయంగా గడిపారు. అయితే ప్రశాంతంగా పీఎల్‌జీఏ వారోత్సవాలు ముగియడంతో ఓవైపు పోలీసులు, మరోవైపు మావోయిస్టు ప్రభావిత గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.‌

Advertisement

Next Story

Most Viewed