- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓవైపు శోభనం.. మరోవైపు డీజేతో వరుడి స్నేహితుల ఎంకరేజ్ మెంట్..
దిశ, వెబ్‌డెస్క్: పెళ్లంటే.. ఆకాశమంత పందిరి .. భూదేవంత అరుగు.. చుట్టూ బంధువులు, స్నేహితులు మధ్య జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. తమ పెళ్లి చాలా గ్రాండ్ గా జరుపుకోవాలని, స్నేహతులకు మంచి బరాత్ ఇవ్వాలని వధూవరులిద్దరూ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా వరుడు తమ ఫ్రెండ్స్ అందరికి బ్యాచ్లర్ పార్టీ ఇవ్వాలని ఎంతో ఉవిళ్లూరుతుంటాడు. కానీ కరోనా మహమ్మారి వలన వీటన్నింటిని పక్కన పెట్టి అత్యంత సన్నిహితుల మధ్య జరుపుకొంటున్నారు. అయితే.. ఓ పెళ్లికొడుకు తన పెళ్లి వేడుకలో ఎలాగైనా డీజే పెట్టించుకోవాలని భావించాడు. కరోనా వలన అది కుదరకపోయేసరికి ఓ తింగరి పని చేసి కటకటాలపాలయ్యాడు.
వివరాలలోకి వెళితే.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మంగళూరుకు చెందిన దామోదర్ శెట్టిగార్ తన కుమారుడు రంజిత్ ఇటీవలే వివాహం చేసుకున్నాడు. ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలనుకున్న అతని ఆశలు కరోనా వలన ఆవిరయ్యాయి. దీంతో అతని పెళ్లి కేవలం 25 మంది ఆహ్వానితుల మధ్య జరిగింది. అయితే రంజిత్ కి తన స్నేహితులందరికీ పార్టీ ఇవ్వాలని కోరిక.. ఎలాగో పెళ్లి అయిపోయింది కదా అని తన శోభనం రోజు రాత్రి.. ఫ్రెండ్స్ అందరికి మందు పార్టీ ప్లాన్ చేశాడు.
డీజే పెట్టించి, స్నేహితులందరికీ మందు పార్టీ ఇచ్చాడు. ఒక పక్క బాబుగారి శోభనం.. మరోపక్క మందుబాబుల వీరంగంతో ఆ వేదిక దద్దరిల్లిపోయింది. ఇక ఈ పార్టీని కొంతమంది ఔత్సాహికులు వీడియోలు తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. అవి కాస్తా వైరల్ గా మారి పోలీసుల కంటపడ్డాయి. ఇక దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వరుడు రంజిత్ ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఈ తింగరి పనితో శోభనం గదిలో ఉండాల్సిన పెళ్ళికొడుకు కటకటాల వెనక్కు వెళ్ళాడు.