- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం కొనుగోళ్లు చేయకపోతే తెలంగాణలో మరో ఉద్యమం: పోలాడి
దిశ, మానకొండూర్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్న అలసత్వం వీడకుంటే తెలంగాణలో ఉద్యమం చేపడుతామని రైతు సంఘాల సమాఖ్య జాతీయ నేత పోలాడి రామారావు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు, ప్రజా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టే ఆందోళన కార్యక్రమాలపై.. బుధవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో రైతు ప్రజా సంఘాల ఓసీ సమాఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా, వర్షాలకు తడిచి మొలకెత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉండగా, రాష్ట్రంలో దాని పరిమితిని తగ్గించారన్న సాకుతో రాష్ట్ర ప్రభుత్వం సైతం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఓ వైపు కేంద్రం బాయిల్డ్ బియ్యం కొనమని మొండి వైఖరి అవలంభించడం, మరో వైపు వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులు యాసంగి సాగుపై అయోమయంలో ఉన్నారని గుర్తుచేశారు. వెంటనే రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.