అన్నదాతలతో చెలగాటం వద్దు: పోలాడి రామారావు

by Sridhar Babu |
అన్నదాతలతో చెలగాటం వద్దు: పోలాడి రామారావు
X

దిశ, కరీంనగర్ సిటీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలతో ఆడుతున్న చెలగాటం మాని, సంక్షేమానికి పాటుపడాలని రైతు సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. పాలక ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టే ఆందోళన కార్యక్రమాలపై.. ఉమ్మడి జిల్లా రైతు, ప్రజా సంఘాల ప్రతినిధులు, సమాఖ్య నాయకులతో కలిసి గురువారం నగరంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.

సమాజంలో అన్ని వర్గాల సంక్షేమమే తమ లక్ష్యమని గొప్పలు చెప్పుకునే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల సమస్యలపై నిర్లక్ష్యం, వివక్ష ఎందుకు చూపిస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. బడా కార్పొరేట్, పారిశ్రామిక వ్యక్తులకు లక్షల కోట్ల రూపాయల బకాయిలు రద్దు చేసి వారికి అనేక రాయితీలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. కానీ, అన్నదాతలు పండించిన పంటలపై అనేక ఆంక్షలు విధించి అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలతో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించకుండా నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed