- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషమంగా ఎస్పీ బాలు ఆరోగ్యం
దిశ, వెబ్‌డెస్క్: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కరోనా పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆయన కొద్దిరోజుల క్రితం చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన వారం క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మూడ్రోజుల క్రితం ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఐసీయూలో ఎక్మో సపోర్టుతో వైద్యం అందిస్తున్నారు. విదేశీ వైద్య నిపుణులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ బాలుకు వైద్యం అందిస్తున్నట్లు ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ అనురాధ భాస్కర్ గురువారం వెల్లడించారు.
అటు తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఫేస్‌బుక్ పేజీలో కొత్త వీడియోను విడుదల చేసిన ఎస్పీ చరణ్ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి హెల్త్ కండీషన్ విషమంగానే ఉన్నట్లు తెలిపారు. నా తండ్రి ఆరోగ్య పరిస్థితిలో ఇంతవరకు ఎలాంటి మార్పు రాలేదని, కాబట్టి అప్ డేట్ చేయడానికి ఏమీ లేదని, ఆయన కోలుకుంటారని మేము నమ్మకంగా ఉన్నామన్నారు. అభిమానులు చేస్తున్న ప్రార్థనలతో వీలైనంత త్వరగా కోలుకోవాలని, దేవుడికి మనస్సాక్షి ఉంది కాబట్టి ఆయన తిరిగి వస్తారన్న నమ్మకం ఉందంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.
బాల సుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని సినీలోకం మొత్తం గళం ఎత్తింది. నీరాక కోసం ఎదురుచూస్తున్నామంటూ స్వరార్చన చేసింది. క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సామూహిక ప్రార్థనలు చేశారు. నీ పాటల కోసం ఎదురు చూస్తున్నామంటూ వేలాది మంది సీని నటులు సామాజిక మాధ్యమాల ద్వారా ట్వీట్లు చేశారు.