బాలయ్యకు డాక్టరేట్…

by Shyam |   ( Updated:2021-05-02 03:03:24.0  )
 బాలయ్యకు డాక్టరేట్…
X

దిశ సిద్దిపేట: ప్రముఖ కవి పొన్నాల బాలయ్య తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టరేట్ కు ఎంపికయ్యారు. ఈ మేరకు యూనివర్సిటీ కంట్రోలర్ ఉత్తర్వులను విడుదల చేశారు. డాక్టర్ ప్రవీణ్ భాయి మార్గదర్శనంలో హిందీ, తెలుగు దళిత కవిత్వంలో అభివ్యక్తీకరణ శిల్పం అంశంపై ఆయన సమర్పించిన పరిశోధన గ్రంధానికి గాను డాక్టరేట్ కు ఎంపిక చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన పొన్నాల బాలయ్య ప్రస్తుతం శ్రీరాములపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు.

తెలంగాణ మాండలికం.. పీడితుల ఆర్తనాదం తన రచనల్లో ప్రతిధ్వనిస్తుంది. ఎగిలి వారంగా, పో , DANDEDA, MIGGU,LANDA, గోరి రచనలతో ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. బాలయ్య రచనలు తెలంగాణ సాహిత్య అకాడమీ ఉత్తమ నవల పురస్కారం, సినారె పురస్కారం ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ కవితా పురస్కారం, అంబేద్కర్ ఫెలోషిప్ ,జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ,తెలంగాణ ఆత్మ బంధువు, జన జాగృతి పురస్కారాలను అందుకున్నారు. పొన్నాల కు డాక్టరేట్ లభించడం పట్ల సిద్దిపేట జిల్లా తెలంగాణ రచయితల సంఘం ,మంజీరా రచయితల సంఘం, కవులు ,రచయితలు, సాహిత్యాభిమానులు వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed