ఈ సర్పంచ్ మాకొద్దు.. ఎమ్మార్వోకు ఫిర్యాదు

by Sridhar Babu |
ఈ సర్పంచ్ మాకొద్దు.. ఎమ్మార్వోకు ఫిర్యాదు
X

దిశ, సిరిసిల్ల:

సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోడు వ్యవసాయ భూముల విషయంలో నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. హరితహారం కార్యక్రమం మొదలైదంటే చాలు అటవీ గ్రామాల్లో పంచాయితీలు సర్వసాధారణంగా మారిపోయాయి. వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో తమకు కూడా అటవీ భూములు కేటాయించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు అడవిని నరికేందుకు యత్నించారు. అడవి పదిర గ్రామస్తులకు ఇచ్చినట్టుగానే తమకు కూడా అటవీ భూముల్లో పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వారందరినీ స్టేషన్‌కు తరలించారు. ఇదే మండలంలోని మద్దిమల్ల సర్పంచ్ కనకవ్వ 20 ఎకరాల పోడు భూమిని అక్రమించుకున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సర్పంచ్ తమకు వద్దంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. కోనరావు పేట మండలం జై సేవాలాల్ తండాలో హరితహారం కార్యక్రమం నిర్వహించేందుకు అటవీ అధికారులు వెల్లగా గిరిజనులు వారిని అడ్డుకున్నారు. దీంతో తండాలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో డీఎస్పీ చంద్రకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గిరిజనులను స్టేషన్‌కు తరలించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే గత 40 ఏళ్లుగా తాము ఇదే భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed