చిన్నారులకు న్యుమోకోకల్ వ్యాక్సిన్ వేయించాలి

by Shyam |
చిన్నారులకు న్యుమోకోకల్ వ్యాక్సిన్ వేయించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: న్యూమోనియా వ్యాధి నుంచి చిన్నారులను రక్షించేందుకు న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ)ను తప్పనిసరిగా వేయించాలని వైద్యారోగ్యశాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటికే ప్రత్యేక ప్రత్యేక డ్రైవ్‎లు ఏర్పాటు చేసి మరీ టీకాలను అందిస్తోన్నమని తెలిపింది. చిన్నారుల్లో వచ్చే న్యుమోనియా కట్టడి చర్యల్లో భాగంగా ఈ టీకాలను అన్ని పీహెచ్​సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు సహా ప్రభుత్వ టీకా కేంద్రాల్లోనూ అందుబాటులో ఉంచామని అధికారులు వెల్లడించారు. దీనిని తీసుకోవడం వలన చల్లని వాతావరణ పరిస్థితుల్లో చిన్నారులకు వచ్చే శ్వాసకోశ సమస్యల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. న్యుమోకోకల్ బ్యాక్టీరియా కారణంగా చెవిలో, సైనస్ భాగాల్లో, రక్తంలోని ఇన్​ఫెక్షన్‎ను అడ్డుకోవచ్చన్నారు. కావున ఐదేళ్ల లోపు పిల్లలంతా కచ్చితంగా పీసీవీని తీసుకోవాలని హెల్త్ ఆఫీసర్లు స్పష్టం చేశారు. దీన్ని ఆరు వారాల సమయంలో ఒక డోసు, 14 వారాల వయసులో రెండో డోస్, ఇక మూడో డోస్ ను 9వ నెలలో తీసుకోవాలన్నారు. కనీసం ఒకడోస్ అయినా కచ్చితంగా ఏడాది లోపు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సుమారు రూ. 4 వేలు ఖర్చయ్యే టీకాను ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా అందిస్తున్నామని, ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed