- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోదీ రూ. 15 వేలు ఇవ్వడం లేదు @ ఫేక్ న్యూస్
దిశ వెబ్ డెస్క్ : కరోనావైరస్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో బోలెడన్ని నకిలీ వార్తలు సర్క్యులేట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తే.. కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం ఆదేశాలిస్తున్న.. అవి మాత్రం ఆగడం లేదు. ఓ వైపు .. ప్రపంచమంతా కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తుంటే… ఇదే సమయంలో నకిలీ వార్తలు, తప్పుదోవ పట్టించే సమాచారంతో మరో పోరాటం చేయాల్సి వస్తోంది. ఈ విపత్తు సమయాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుని సైబర్ క్రైమ్ లకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రధాని మోదీ పేరును ఇందుకు వాడుకుంటున్నారు. మోదీ ప్రతి అకౌంట్లో 15 వేల రూపాయలు జమ చేస్తున్నారంటూ ఓ మెసేజ్ ఇప్పుడు బాగా సర్క్యూలేట్ అవుతోంది.
దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు… మోసాలకు పాల్పడుతున్నారు. కరోనాకు సంబంధించిన ప్రతి అంశాన్ని వాళ్లు ఉపయోగించుకుంటూ డబ్బులు కాజేస్తున్నారు. మొదట్లో కరోనా మ్యాప్ , కరోనా అప్ డేట్స్ పేరుతో నకిలీ వెబ్ సైట్లు సృష్టించి, వాటిని క్లిక్ చేసిన వాళ్ల అకౌంట్లను హ్యాక్ చేశారు. ఆ తర్వాత ఆన్ లైన్ మద్యం పేరుతో కొందరిని మోసం చేశారు. ఇప్పుడో మరో మోసానికి తెర తీశారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రతి భారతీయుడికి ప్రధాని నరేంద్ర మోదీ రూ.15 వేలు ఇస్తున్నట్టు నకిలీ మెసేజ్ సృష్టించారు. అంతేకాదు డబ్బులు తీసుకోవాలంటే ఈ లింకుపై క్లిక్‌చేసి, అందులోని దరఖాస్తును నింపాలని సూచించారు. అయితే ఇది నకిలీ సమాచారం అని, ఈ లింక్‌పై క్లిక్ చేయొద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) సూచించింది. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని, మోసపోవద్దని పీఐబీ పేర్కొంది.
Tags : corona virus, pm, pib,cyber crime