వారాల్లోనే ఔషధాల ఉత్పత్తి పెరగడం సంతోషం : పీఎం మోడీ

by Shamantha N |   ( Updated:2021-05-12 11:07:25.0  )
వారాల్లోనే ఔషధాల ఉత్పత్తి పెరగడం సంతోషం : పీఎం మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఆక్సిజన్, వ్యాక్సిన్ కొరత వలన చాలా మంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో అన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కరోనా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో ఆక్సిజన్ సరఫరా, మందుల లభ్యతపై చర్చ జరిపారు. ప్రస్తుతం రాష్ట్రాల అవసరాన్ని బట్టి సరిపడా మందులు సరఫరా చేస్తున్నామని ప్రధాని మోడీ వెల్లడించారు. కొన్ని వారాల్లోనే ఔషధాల ఉత్పత్తి పెరగడంపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. రెమిడెసివిర్, ఇతర ఔషధాల ఉత్పత్తి పెరిగిందని మోడీ తెలిపారు. కరోనా సమయంలో ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed