వరవరరావు విడుదలపై జోక్యం చేసుకోవాలి

by Shyam |
వరవరరావు విడుదలపై జోక్యం చేసుకోవాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో :
అనారోగ్యంతో బాధపడుతున్న కవి, రచయిత వరవరరావును మహారాష్ట్రలోని ముంబై జైలు నుంచి విడుదల చేయడంలో జోక్యం చేసుకోవాలని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర‌మోడీని కోరారు.ఈ విషయమై ఆదివారం ఆయన ప్రధానికి లేఖ రాశారు. జైల్లో ఉన్న వరవరరావు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ముంబై జెజె ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నాడని తెలిపారు. వరవరరావును వెంటనే బెయిల్ పై విడుదల చేసి తమ కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. బెయిల్ కోసం విజ్ఞప్తి చేసినప్పటికీ పెండింగ్‌లో పెట్టారని వివరించారు.తాను వామపక్ష ఆలోచనలు, భిన్నమైన ఆలోచన కలిగి ఉన్నందుకు ఎవరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు.కావున ఆయన్ను మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌ ఆస్పత్రికి పంపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డికి రాసిన ప్రత్యేక లేఖలో కోరారు. వరవరరావును హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తే, కుటుంబ సభ్యులు దగ్గర ఉంటే సగం జబ్బు నయమవుతుందని చెప్పారు.అనారోగ్యంతో ఉన్న వరవరరావును తమ కుటుంబ సభ్యులు కూడా కలుసుకోవడానికి వీలులేక పోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.లేదా వారి కుటుంబానికి ముంబై వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కల్పించండని కోరారు.

Advertisement

Next Story

Most Viewed