కాసేపట్లో ప్రధాని అధ్యక్షతన కీలక సమావేశం..

by Shamantha N |
కాసేపట్లో ప్రధాని అధ్యక్షతన కీలక సమావేశం..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది. రోజువారీగా రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలో పోలిస్తే సెకండ్ వేవ్‌లో రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా నియంత్రణకు కేంద్రం ఎన్ని చర్యలు చేపట్టినా వైరస్ వ్యాప్తి కంట్రోల్ కావడం లేదు. ఓ వైపు వ్యాక్సిన్ కొరత, మరోవైపు ఆక్సిజన్, బెడ్స్ కొరత రాష్ట్ర ప్రభుత్వాలను వేధిస్తోంది. ఇక శ్మశనాల్లో అయితే కొవిడ్ మృతులతో నిండిపోతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించనున్నారు. కరోనా నియంత్రణ చర్యలపై వివిధ మంత్రిత్వ శాఖలు, నీతి అయోగ్ ప్రతినిధులతో మోడీ భేటీ కానున్నారు. వ్యాక్సినేషన్ సామర్థ్యం పెంపు, పంపిణీ ప్రక్రియతో పాటు నైట్ కర్ఫ్యూ విధించవచ్చునని ఊహగాహనాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, లాక్‌డౌన్ పై సమాలోచనలు జరుగుతున్నట్లు కూడా పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed