- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చక్కా జామ్ టెన్షన్.. ప్రధాని అధ్యక్షతన హై లెవల్ మీట్!
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను రద్దుచేయాలని కోరుతూ రైతు సంఘాల నాయకులు శనివారం ‘చక్కా జామ్’(రోడ్ల నిర్భంధం)కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రేపు జరిగే ఈ ఆందోళన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఢిల్లీ పోలీసులు ఇప్పటికే సరిహద్దులను బ్లాక్ చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పాటు, ముళ్ల కంచెలు, రోడ్లపై మేకులను ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ భవన్‌లో ప్రధాని మోడీ అధ్యక్షతన హైలెవల్ మీట్ నడుస్తోంది. దీనికి కేంద్రమంత్రులు అమిత్ షా, పీయూష్ గోయెల్, ప్రహ్లాద్ జోషి, ప్రకాశ్ జవడేకర్ హాజరయ్యారు. ఇదిలాఉండగా, సాగు చట్టాలపై సోమవారం రాజ్యసభలో ప్రధాని మోడీ విపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇవ్వనున్నారు. కాగా, గత నాలుగు రోజులుగా పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలపై రచ్చ నడుస్తోంది. అందువల్లే ప్రధాని హైలెవల్ కమిటీ మీట్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.