మొక్కలు నాటిన హైదరాబాద్ ఫిక్కీ లేడీస్

by Shyam |
మొక్కలు నాటిన హైదరాబాద్ ఫిక్కీ లేడీస్
X

దిశ, న్యూస్ బ్యూరో: ఫిక్కీ లేడీ ఆర్గనైజేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం హరితహారం జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్డు నం.10 సి లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ ఉషారాణి మన్నె మాట్లాడుతూ.. మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు.

చెట్ల పెంపకంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఆమె తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో చెట్లే ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. కాలుష్య నివారణకు, స్వచ్ఛమైన గాలి కోసం ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలని కోరారు. తాము 300 మొక్కలు నాటడంతో పాటు 300 ట్రీ గార్డులను అందజేసినట్లు ఉషారాణి మన్నె చెప్పారు.

Advertisement

Next Story