- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లిప్‌స్టిక్, చీర కట్టులో లండన్ బాబు.. ఫొటో వైరల్
దిశ, ఫీచర్స్ : లింగసమానత్వ సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, స్త్రీ పురుషుల మధ్య అంతరాలు తగ్గించాలనే మాటలను ఎప్పటి నుంచో వింటున్నాం. ఈ దిశగా ప్రయత్నించేవారి గురించి పక్కనబెడితే, తమదాకా వచ్చేసరికి వెనక్కి తగ్గేవారే ఎక్కువ. మొదట వేషధారణ దగ్గరి నుంచే ఈ తేడా మొదలవుతుండగా, ఫ్యాషన్ వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ‘పర్టిక్యులర్ దుస్తులే ధరించాలని రూల్ లేనప్పటికీ.. స్త్రీలు ఇవే ధరించాలి, పురుషులు ఇవే ధరించాలన్న అపోహలు మాత్రం సమాజంలో వేళ్లూనుకుపోయాయి’. కాగా ఈ స్టీరియోటైప్స్ బ్రేక్ చేసి, వేషధారణలో సరికొత్త మార్పు తీసుకొచ్చేందుకు కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి డిఫరెంట్ ఫీట్ చేశాడు. అదేంటంటే..
నిజానికి వేషధారణకు సంబంధించి నిర్దిష్ట నియమాలేమీ లేవని ఫ్యాషన్ నిపుణులు చెప్తున్నారు. ఈ విషయాన్ని ప్రూవ్ చేసేందుకు కోల్‌కతాకు చెందిన పుష్పక్ శారీ ధరించిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశాడు. ఈ నెల15న బెంగాల్ నూతన సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫొటోను షేర్ చేయగా.. అప్పటి నుంచి నెట్టింట్లో వైరల్‌గా మారింది. లండన్‌లో మాస్టర్స్ చదువుతున్న పుష్పక్.. ఆకుపచ్చ చీరలో రెడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని, ఐ బ్రో చేయించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫొటోలు పోస్ట్ చేసినందుకు పలువురు పుష్పక్‌ను ట్రోల్ చేస్తుండగా, మరి కొందరు ప్రశంసిస్తున్నారు.
అయితే తాను సొసైటీలో నాటుకుపోయిన స్టీరియోటైప్స్ బ్రేక్ చేసేందుకే ఈ ఫీట్ చేశానని పుష్పక్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ టైప్ ఆఫ్ ఫ్యాషన్ మెల్లగా ట్రెండ్ అవుతోంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ సెలబ్రిటీలు రణ్‌వీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా, జిమ్ సర్ఫ్.. పలు ఈవెంట్స్‌లో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ క్లోత్స్(మహిళలు ధరించేవి) ధరించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.