రూ. 999తో ఆరోగ్య బీమా ప్లాన్ ప్రారంభించిన ఫోన్‌పే!

by Shyam |   ( Updated:2021-12-02 10:07:20.0  )
phonepe
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే గురువారం తన కొత్త ఆరోగ్య బీమా ప్లాన్‌ను ప్రారంభించింది. రూ. 999 తో ప్రారంభమయ్యే ఈ హెల్త్ @999 ప్లాన్ ద్వారా అనుకోని వైద్య ఖర్చుల నుంచి భద్రత, మొదటిసారి ఆరోగ్య బీమా కవరేజీ కొనాలనుకునే యువత కోసం అందిస్తున్నట్టు ఫోన్‌పే వెల్లడించింది. ఇటువంటి బీమా ప్లాన్ దేశీయ డిజిటల్ చెల్లింపుల విభాగంలోనే మొట్టమొదటిదని, ఇది సరసమైన ధరలే సమగ్రమైన హెల్త్ కవరేజీని అందిస్తుందని ఫోన్‌పే ఓ ప్రకటనలో పేర్కొంది.

కేవలం మూడు దశల్లో ఈ ఆరోగ్య బీమాను సులభంగా పొందవచ్చని, పాలసీ కొనాలనుకునే వినియోగదారులు పాలసీదారు పేరు, వయసు, జెండర్, ఈ-మెయిల్ ఐడీ లాంటి వివరాలను మాత్రమే ఇస్తే సరిపోతుందని ఫోన్‌పే తెలిపింది. ‘ముఖ్యంగా మొదటిసారి బీమా కొనుగోలు చేసేవారి కోసం ఈ ‘హెల్త్ @999 ప్లాన్‌ను రూపొందించాం. వినియోగదారులకు మెరుగైన, సరసమైన ఆరోగ్య బీమాను ఇది భర్తీ చేస్తుంది.

ఫోన్‌పే యాప్‌లో వీలైనంత తక్కువ సమయంలో, సులభంగా ఈ ఆరోగ్య బీమాను కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల వినియోగదారులు గణనీయమైన ప్రయోజనం పొందుతారనే విశ్వాసం ఉందని’ ఫోన్‌పే ఇన్సూరెన్స్ విభాగం వైస్-ప్రెసిడెంట్ గుంజన్ ఘై అన్నారు. ఈ ప్లాన్ దేశంలోని మొత్తం 7,600 ఆసుపత్రులలో వర్తిస్తుందని, జీవితకాల రెన్యూవల్ ఫీచర్‌తో ఇది వస్తుందని ఫోన్‌పే పేర్కొంది.

రైళ్లు అద్దెకివ్వబడును.. దరఖాస్తు చేసుకోండి

LICలో ఏ పాలసీ మంచిదో తెలుసా..? ఆ బీమాతో బెనిఫిట్స్ ఎక్కువేనట!

Advertisement

Next Story